శ్రీముఖిని కాదన్న బన్నీ..?

96
srimukhi

బుల్లితెర యాంకర్లుగా రాణిస్తున్న రెష్మి, అనసూయ, శ్రీముఖి వంటి హాట్ బామలకు ఈ మధ్య సినిమాల్లో మంచి అవకాశాలే వరిస్తున్నాయి. ఇప్పటికే వెండితెరపై రెష్మి అనసూయ సందడి చేయగా..నాకేం తక్కువ అంటూ శ్రీముఖి కూడా అదరగొట్టేందుకు సిద్ధమైంది. అవసరాల శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతున్న అడల్ట్‌ కామెడీ సినిమా ‘హంటర్‌’లో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా శ్రీముఖికి హీరోయిన్‌గా మరో బంపర్ ఆఫర్ కొద్దిలో మిస్ అయిందట. అందేంటంటే స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సరసన నటించే అవకాశం తృటిలో చే జారిపోయిందట. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కారణముందట.

srimukhi
హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటిస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌గా పూజా హెగ్డే ఎంపికైంది. మరో హీరోయిన్‌గా శ్రీముఖిని తీసుకోవాలని చిత్రయూనిట్‌ డిసైడ్‌ అయింది. అయితే ఆ నిర్ణయానికి బన్నీ అంగీకరించలేదట. గతంలో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘జులాయి’ సినిమాలో బన్నీ చెల్లెలుగా నటించింది శ్రీముఖి. ఇప్పుడు ఆ సినిమాయే శ్రీముఖి ఓ బంపరాఫర్‌ మిస్‌ అవడానికి కారణమైంది. గతంలో తన చెల్లెలిగా నటించిన శ్రీముఖితో ఇప్పుడు రొమాన్స్‌ చేయడం బాగోదని బన్నీ ఫీలయ్యాడట. అందుకే శ్రీముఖిని కాకుండా మరో హీరోయిన్‌ని వెతకమని చెప్పాడట.

srimukhi

బన్నీ ఆఫర్ మిస్‌ అవ్వడంతో శ్రీముఖి కాస్త నిరాశకు గురైందట. ఒకవేళ అమ్మడును ఈ అవకాశం వరిస్తే మాత్రం శ్రీముఖి రేంజే మారిపోయేది.  ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్‌లో స్టార్ హీరోయిన్‌ ఇమేజ్‌ ను సంపాదించుకునేది. చేతిలో ఉన్న హాంటర్ సినిమాతోనైనా తానేంటో నిరూపించుకోగలితే..అమ్మడు జాతకం మారినట్టే..