దేశంలో ఉరి దాడుల తరువాత పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం ఏదైనా ఉందంటే… ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో పాకిస్థాన్ నటుడు ఫవద్ ఖాన్ నటించడమే. ముఖ్యంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీ ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని ఎంత రభస క్రియేట్ చేసిందో తెలియంది కాదు. పాకిస్తాన్ యాక్టర్‌లు నటించిన సినిమాలు భారత్‌లో ఆడడానికి వీలు లేదని హెచ్చరికలు చేసింది ఎంఎన్‌ఎస్. చివరికి కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్ప ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. అయినా ఎంఎన్‌ఎస్ వెనక్కి తగ్గలేదు. థియేటర్లను బద్దలు కొడతామని ఎంఎన్‌ఎస్ తీవ్ర హెచ్చరికలు చేయడంతో ముష్కిల్ సినిమా దర్శక-నిర్మాతలు దిగిరాక తప్పలేదు. పవాద్ ఖాన్ నటించిన సీన్లను తొలగిస్తామని.. అదేవిధంగా ఆర్మీ సంక్షేమ నిధికి రూ. 5 కోట్లు చెల్లిస్తామని చిత్ర నిర్మాతలు ఎంఎన్‌ఎస్‌కు హామీ ఇవ్వడంతో ఈ సినిమా విడుదలయ్యింది. ఈ విషయం రాజకీయ ప్రముఖుల నుంచి బాలీవుడ్ వరకు దుమారం రేపింది. విడుదలకు ముందే ఈ చిత్రం వివాదాస్పదంగా మారినా.. విడుదలయ్యాక బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
ఇక ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలకు ముందు ఐశ్వర్య-రణబీర్ ల హాట్ ఫోటోషూట్‌లు ఈ సినిమాకు మరింత హైప్‌ని క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా అనుష్క శర్మ ఉన్నప్పటికీ.. ఐశ్వర్య-రణబీర్‌ల ఇంటిమేట్ ఫోటోలతోనే పెద్దగా పబ్లీసిటీ చేశారు చిత్ర నిర్మాతలు. ఇక ఈ ఫోటోలు ఐశ్వర్యకు పెద్ద తలనొప్పిని కూడా తెచ్చాయి. రణబీర్‌తో ఐశ్వర్య ఇంటిమేట్‌గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో… ఐశ్వర్య మామ బిగ్ బీ అమితాబ్ కూడా కోపంగా ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఒకదశలో ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్‌లు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు కూడా హల్ చల్ చేశాయి.
ఈ నేపథ్యంలో ఐశ్వర్య-రణబీర్‌ల రోమాన్స్ గురించి రణబీర్ మనసులో మాట బయటపెట్టాడు. తనకు ఐశ్వర్యకు ఇంటిమేట్ సీన్లు చేయాలని దర్శకుడు కరణ్ జోహార్ చెప్పినపుడు తాను ఒప్పుకోలేదని… ఐశ్వర్యను ముట్టుకోవాలంటే తన చేతులు వణికిపోయాయని రణబీర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే ఐశ్వర్యనే కల్పించుకుని మనం యాక్టింగ్ మాత్రమే చేస్తున్నాం.. ఏం పర్లేదని తనను ఎంకరేజ్ చేసిందని రణబీర్ చెప్పాడు. అయినా తాను హెసిటేట్ చేస్తుంటే.. ఐష్ గిల్లీ మరీ నటించమని చెప్పిందని అన్నాడు. ఇక ఈ సినిమాతో పుట్టుకొచ్చిన గాసిప్స్ అన్నింటినీ.. ఐశ్వర్య ఫ్యామిలీ తేలిగ్గానే తీసుకుంది. ఎందుకంటే బచ్చన్ కుటుంబమంతా సినిమావాళ్లే కదా. వాళ్లకు తెలియదా.. ఐశ్యర్య ప్రొఫెషనలిజం గురించి..