పంచె కట్టిన బాబాయ్, అబ్బాయ్..

256
Rana... venkatesh
- Advertisement -

తేజ డైరెక్షన్ లో దగ్గుబాటి రానా హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి ఈ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. అందాల భామ కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రానా కొత్త గెటప్ తో పంచె కట్టి, పొలిటీషియన్ గా ఆకట్టుకున్నాడు. సినిమా షూటింగ్ మొదలైనప్పట్నుంచీ, ఆడియో, సక్సెస్ మీట్ లాంటి వేడుకల్లోనూ రానా పంచెకట్టుతోనే దర్శనమిచ్చాడు.

ఇక అదే పాత్రలో హీరో వెంకటేష్‌ చేస్తే ఎలా ఉంటదో ఓసారి ఊహించుకోండి.. ఆ తెల్ల షర్టు, తెల్ల పంచె కట్టుకుని తాను కూడా జోగేంద్రనే అన్నట్టుగా రానాతో కలిసి వెంకటేష్‌ ఉన్న వీడియో హల్‌ చల్‌ చేస్తుంది. ఈ వీడియోను రానా తన ట్విట్టర్ లో పోస్టు చేశాడు.  వెంకీ స్టైల్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్న ఈ వీడియోను  మీరు కూడా చూడండి..

- Advertisement -