ప్రభాస్‌ కి లైన్‌ క్లియర్‌…

221
- Advertisement -

సుజీత్‌ దర్శకుత్వంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ‘సాహో’. ఈ సినిమాలో ప్రభాస్‌ తో రొమాన్స్‌ చేసే హీరోయిన్‌ ఎవరంటూ జోరుగానే వార్తలు సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేశాయి. అయితే ఈ చిత్ర టీమ్‌ కూడా హీరోయిన్‌ కోసం తెగ గాలించారు.

ఓ దశలో అనుష్కను కూడా ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వాటన్నింటికి తెరదించుతూ చిత్ర బృందం శ్రద్ధాకపూర్‌ను ఎంపిక చేసింది. మొత్తానికి ప్రభాస్‌తో రొమాన్స్‌ చేసే ఛాన్స్‌ను బాలీవుడ్‌ భామ శ్రద్ధాకపూర్‌ కొట్టేసింది.

Finally Prabhas Fixed Bollywood Actress For Saaho Movie

‘సాహో’లో బాలీవుడ్‌ భామనే ఎంపిక చేసుకోవాలని చిత్రబృందం కూడా ఎప్పటి నుంచో సన్నాహాలు చేస్తోంది. ఎట్టకేలకు అనుకున్నట్లే శ్రద్ధా కపూర్‌ను ఎంచుకున్నారు. ఈ చిత్రాన్ని చాలా స్టైలిష్‌గా తెరకెక్కించబోతున్నట్లు టీజర్‌ ద్వారా దర్శకుడు సుజిత్‌ చెప్పకనే చెప్పారు.

ఇక దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి శంకర్‌ఎహసాన్‌ లాయ్‌ సంగీతం అందిస్తున్నారు. ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంలో దీనిపై క్రేజ్‌ మామూలుగా లేదు.

- Advertisement -