శాండల్‌వుడ్‌ బ్యూటీతో రానా రొమాన్స్‌..

208
Rana to romance Shraddha Srinath in Bala's film..
- Advertisement -

బాహుబలి క్రేజ్ తో రానా ఇటు కోలీవుడ్, అటు బాలీవుడ్ లోనూ నటిస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రానా ఒక క్రేజీ తమిళ్ దర్శకుడితో పనిచేయడానికి ముందుకు రాబోతున్నాడు.   ‘శివపుత్రుడు’, ‘నేను దేవుడ్ని’, ‘వాడు వీడు’ సినిమాలతో  సత్తా చాటిన బాలతో సినిమా చేయనున్నాడు.

ప్రస్తుతం తమిళ అర్జున్ రెడ్డి ‘వర్మ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న బాలా ఆ చిత్రం పూర్తయ్యాకే ఈ చిత్రాన్ని మొదలుపెట్టే అవకాశముంది. ఈ చిత్రం 2018లో సెట్స్‌ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో రానా సరసన కన్నడ నటి శ్రద్దా శ్రీనాథ్ జోడి కట్టనుంది.

Rana to romance Shraddha Srinath in Bala's film..
రానా ప్రస్తుతం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత నేపధ్యంలో ‘1945’ అనే చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాడు. ఇదే కాక పీరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రంలో కేరళ ట్రావెన్కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండ్ వర్మ పాత్ర పోషించనున్నాడు . ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందనుంది. వీటితో పాటు 1971లో హిందీలో వచ్చిన హథీ మేరీ సాథీ రీమేక్ చిత్రం చేస్తున్నాడు. ఇవే కాక గుణశేఖర్ డైరెక్షన్ లో హిరణ్యకశ్యప అనే చిత్రం కూడా చేయనున్నట్టు తెలుస్తుంది.   వీటితో పాటే బాల దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు పచ్చజెండా ఊపాడు.

- Advertisement -