బాలయ్య దారిలో ‘లక్ష్మీ పుత్ర’ రానా

79

నందమూరి బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీలు,అభిమానులే కాదు అందరు సినిమాపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. శాతకర్ణి మానియాతో తెలుగు రాష్ట్రలు మార్మోగిపోతున్నాయి. ఉదయం నుంచే సినిమా చూసేందుకు థియేటర్ల వద్దకు అభిమానులు బారులు తీరారు. అర్ధరాత్రి నుంచే సినిమా థియేటర్ల వద్ద అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. శాతకర్ణితో బాలయ్య దేశం మీసం తిప్పాడని….తెలుగు ప్రజలందరు చూడాల్సిన సినిమా అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య సినిమాకు హీరోలు తమ ట్వీట్లతో బ్రహ్మారథం పడుతున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణిపై వస్తున్న వార్తల గురించి తాను వింటున్నానని, ఇక సినిమా చూడకుండా ఆగలేనని హీరో దగ్గుబాటి రానా వ్యాఖ్యానించాడు. దర్శకుడు క్రిష్ కు గౌరవంగా తన ప్రొఫైల్ నేమ్ ను ‘లక్ష్మీపుత్ర రానా’గా మార్చుకున్నట్టు ట్విట్టర్‌లో కామెంట్‌ను పోస్టు చేశాడు రానా.

Rana praises NBK's Gautamiputra Satakarni

హీరో మంచు మనోజ్,మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ 40 నిమిషాల క్రితం చిత్రంపై స్పందించారు. “డేరింగ్ డాషింగ్ నటసింహ బాలయ్య అన్నకు, క్రిష్ బాబాయ్ కి థ్యాంక్స్. శరణమా… రణమా” అని మనోజ్ ట్వీట్ చేయగా, “జీపీఎస్కే గురించి గొప్పగా రిపోర్టులు వస్తున్నాయి. చిత్ర బృందానికి అభినందనలు. బాలయ్యా… మీరు మాలో చాలామందికి ఆదర్శం” అని సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్‌లో సినిమాపై ప్రశంసలు గుప్పించారు.

Rana praises NBK's Gautamiputra Satakarni

మెగా బ్రదర్‌ నాగబాబు ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలను ఓ అభిమాని ఫేస్ బుక్‌లో పోస్టు చేయగా…విపరీతంగా ట్రెండయింది. నాగబాబు సార్ ఈజ్ 100% కరెక్ట్. ఒక హిట్ సినిమాను ఆపలేరు. ఫ్లాప్ సినిమాను లేపలేరు. జై బాలయ్య” అన్న పోస్టుకు గంట వ్యవధిలో వందల కొద్దీ షేర్లు, లైక్ లు వచ్చిపడుతున్నాయి. మొత్తంగా గౌతమి పుత్ర శాతకర్ణి…బాలయ్య కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది.