సమయం లేదు మిత్రమా…చూడాల్సిందే

85
Fans Hunagama at gautamiputra satakarni Theaters

నిన్న ఖైదీ ఫివర్‌తో మెగా అభిమానులు సంబరాలు చేసుకోగా….నేడు శాతకర్ణి మానియాతో నందమూరి అభిమానులు సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. శాతకర్ణిలో బాలయ్య నటనతో అభిమానులు ఫిదా అయిపోతున్నారు. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో గౌతమి పుత్ర శాతకర్ణి చిరకాలం నిలిచిపోతుందని..తెలుగు జాతి ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా బాలయ్య చాటిచెప్పారని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేగాదు ప్ర‌తి తెలుగువాడు త‌ప్ప‌నిస‌రిగా చూడాల్సిన సినిమా శాత‌క‌ర్ణి అంటూ ట్విట్స్ పోస్టు చేస్తున్నారు.

సమయం లేదు మిత్రమా… సినిమా చూడాల్సిందే అంటూ బసవతారక పుత్ర బాలయ్య అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడితో కోలహలంగా మారింది. జై బాలయ్య… జైజై బాలయ్య అనే నినాదంతో థియేటర్లు మారుమోగిపోయాయి. ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే ఈ సినిమా చూసిన కామన్ ఆడియన్స్ స్పందన కూడా బాలయ్య కెరీర్‌లో ఓ మంచి సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి నిలిచిపోతుందని చెబుతున్నారు.

సినిమాలో బాలయ్య డైలాగ్స్‌:

() నేను బొట్టు పెట్టింది నా భ‌ర్త‌కు కాదు…. ఓ చ‌రిత్ర‌కు
()నా రాజ్యంలో పాలించ‌డానికి కాదు…యాచించ‌డానికి కూడా అనుమ‌తించ‌ను
()ఆడ‌దాని క‌డుపులో న‌లిగి న‌లిగి వెలుగు చూసిన ర‌క్త‌పు ముద్ద‌వి
()ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం… ఇక ఉనికిని చాటుదాం
() మ‌మ‌కారం..అహాంకారం రెండూ లేనివాడే నాయ‌కుడు అవుతాడు
()మ‌నం క‌థ‌లు చెప్ప కూడ‌దు…మ‌న క‌థ‌లు జ‌నం చెప్పుకోవాలి
()శ‌ర‌ణం అంటే ర‌క్ష‌…ర‌ణం అంటే మ‌ర‌ణ‌శిక్ష ఏదీ కావాలి
() శాత‌క‌ర్ణి ఒక్క‌డు మిగిలి ఉంటే చాలు… మ‌న‌లో ఒక్క‌డు కూడా మిగ‌ల‌డు
() మ‌గ‌నాలికి గాజులు అందం…మ‌గాడికి గాయాలు అందం
()మారావు అనుకున్నా…గెలిచిన రాజ్యాలు మార్చ‌లేదు…వ‌ల‌చిన ఇల్లాలు మార్చ‌లేదు

అభిమానుల స్పందన..:

() చంద్రుడికి మచ్చ ఉందేమో గానీ.. బాలకృష్ణ నటనకు మాత్రం మచ్చ పెట్టలేం
()తెలుగు సినీ చరిత్రలోనే ఈ చిత్రం మైలురాయి. ప్రతి ఒక్కరూ తప్పక చూడాలి.
()ఇలాంటి చిత్రంలో బాలకృష్ణను చూపించినందుకు క్రిష్‌కు ధన్యవాదాలు.
()బాలకృష్ణ విశ్వరూపం చూపించారు….అభిమానులు మీసం తిప్పేలా తీశారు.
()తెలుగువారి కీర్తిని పెంచే సినిమా
() ప్రయోగాలు చేయడంలో బాలకృష్ణను మించిన హీరో లేరు