అభిమానులతో సందడిచేసిన శాతకర్ణి

94
Balakrishna watches Gautamiputra Satakarni with fans

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో ముందస్తుగా ప్రదర్శంచారు. హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌ అభిమానులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు. దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, యువ కథానాయకుడు నారా రోహిత్‌ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసిన వారిలో ఉన్నారు. సినిమాలో బాలకృష్ణ నటన చూసి అభిమానులు ఫిదా అయిపోయారు.

ఈ షో మొదటి టికెట్ ను రూ.1,00,100 కి గోపిచంద్ యిన్నమూరి అనే అభిమాని దక్కించుకున్నారు. బాలయ్య ఆ అభిమానితో సినిమాను చూసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఎప్పుడు సేవ మార్గంలో ఉండే బాలయ్య బాట లోనే బెనిఫిట్ షో నిర్వాహకులు ఈ టికెట్ మొత్తాన్ని బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆసుపత్రికి అందచేయనున్నారు. ప్రీమియర్ షో నిర్వాహకులైన మనబాలయ్య.కాం నవీన్ మోపర్తి మొదటి టికెట్ సొంతం చేసుకున్న అభిమానికి నారా రోహిత్ చేతుల మీదుగా టికెట్ ను అందచేశారు.

Balakrishna watches Gautamiputra Satakarni with fans

ప్రీమియర్ షో లు అంటే కాసేపు అభిమానం చూపి అరిచి గోల చేసే ఈ రోజుల్లో తమ అభిమాన కధానాయకుడి స్పూర్తితో ఇలా లక్షలాది రూపాయలు సమాజసేవకు ఉపయోగించడం విమర్శకుల ప్రసంసలు సైతం అందుకుంటున్నారు బాలయ్య అభిమానులు.

బెన్‌ఫిట్ షో చూసిన అభిమానులు మరోసారి బాలయ్యే సంక్రాంతి హీరో అంటున్నారు. ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే ఈ సినిమా చూసిన కామన్ ఆడియన్స్ స్పందన కూడా బాలయ్య కెరీర్‌లో ఓ మంచి సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి నిలిచిపోతుందని చెబుతున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయయని..తెలుగు భాషకు, తెలుగు జాతికి ఈ సినిమాలో గౌరవం దక్కిందని ప్రేక్షకులు చెబుతున్నారు.