- Advertisement -
దగ్గుబాటి రానా- మిహీకాల వివాహం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజాగా ఈ పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది దగ్గుబాటి ఫ్యామిలీ. చేనేత వస్త్రాలతో సంప్రదాయంగా కనిపించి అందరిని ఆకట్టుకున్నారు.
సమంత గ్రీన్ కలర్ చేనేత శారీ ధరించగా, నాగ చైతన్య తెల్లటి దుస్తులు ధరించారు.
దగ్గుబాటి ఫ్యామిలీ కూడా చేనేత దుస్తులని ధరించినట్టు తెలుస్తుంది. వెంకటేష్, సురేష్ బాబు పంచెలలో కనిపించగా, మిగతా వారందరు చీరలలో మెరిసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
- Advertisement -