చిక్కుల్లో ఆంగ్ సాన్ సూకీ..!

211
suu kyi
- Advertisement -

మ‌య‌న్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ చిక్కుల్లో పడ్డారు. త‌న హోదాను వాడుకుంటూ సూకీ అవినీతికి పాల్ప‌డిన‌ట్లు ఆధారాలు ఉన్నాయ‌ని యాంటీ క‌రప్ష‌న్ క‌మిష‌న్ పేర్కొంది. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా ధృవీకరించగా అవినీతి వ్య‌తిరేక చ‌ట్టంలోని సెక్ష‌న్ 55 కింద ఆమెపై కొత్త అభియోగాలు న‌మోదు అయిన‌ట్లు పేర్కొంది.

ఈ ఆరోపణలు నిరూపించబడితే మ‌య‌న్మార్ చ‌ట్టం ప్ర‌కారం 15 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో సూకీతో పాటు మాజీ అధ్య‌క్షుడు విన్ మింట్‌ను త‌మ నివాసాల నుంచి జుంటా సైన్యం గుర్తు తెలియ‌ని ప్రాంతానికి త‌ర‌లించింది.

మ‌య‌న్మార్‌లో తిరుగ‌బాటుకు పాల్ప‌డిన సైన్యం.. ప్ర‌భుత్వాన్ని హ‌స్త‌గ‌తం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఫిబ్ర‌వ‌రి నుంచి ఆ దేశంలో అల్ల‌ర్లు కొన‌సాగుతున్నాయి.

- Advertisement -