- Advertisement -
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రంజాన్ వేడుకలు దేశవ్యాప్తంగా నిరాడంబరంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో సామూహిక ప్రార్ధనలపై నిషేధం విధించిన నేపథ్యంలో ఇంట్లోనే ప్రార్ధనలు నిర్వహించిన రంజాన్ వేడుకలను జరుపుకుంటున్నారు.
కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఢిల్లీలోని తన నివాసంలో రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు.కర్ణాటకలోని హుగ్లీతోపాటు ఇతర ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ వేడుకలు జరుపుకుంటున్నారు
ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలోని ఓ ఇంట్లో రంజాన్ ప్రార్థనలు నిర్వహించారు. లాక్ డౌన్ 4.0 కొనసాగుతున్న నేపథ్యంలో చెన్నైలోని ట్రిప్లికానే ఏరియాలో వాలాజా మసీదును మూసివేశారు.
- Advertisement -