శివగామితో విరాట్ కోహ్లి..!

237
Ramya Krishnan Says So Happy to Meet Virat Kohli

ప్రస్తుతం ఇంటర్నెట్లో ‘శివగామి’ రమ్యకృష్ణ, భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీల ఫొటో వైరల్‌గా మారింది. అసలు వీరిద్దరూ ఎక్కడ కలిశారనేదే కదా మీ డౌట్..! వీరిద్దరూ ఎక్కడ కలిశారంటే.. ఇటీవల సీఎన్ఎన్ – న్యూస్ 18 ఛానల్ పలు రంగాలకు చెందిన వ్యక్తులకు అవార్డులు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టిన తెలుగు చిత్రం ‘బాహుబలి 2’. సినిమాకు గాను ‘అత్యుత్తమ విజయం’ అవార్డు అందుకుంది. ఈ వేడుకకు చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ, ‘శివగామి’ రమ్యకృష్ణ హాజరయ్యారు.

కాగా, ఇదే కార్యక్రమంలో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై విరాట్‌తో కలిసి దిగిన ఫొటోను రమ్యకృష్ణ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. విరాట్‌ చాలా మంచి వ్యక్తని, ఆయన్ను కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం రమ్య.. అఖిల్ ‘హలో’తో పాటు.. సూర్య ‘గ్యాంగ్’లోనూ కీలక పాత్రలు పోషిస్తోంది. మొత్తానికి విరాట్ కోహ్లి తో శివగామి ఫోటో ఇప్పుడు హల్చల్ చేస్తుంది.