‘సైరా’ ఫస్ట్‌లుక్‌ కోసం చిరు ఫిట్‌నెస్‌..

174
- Advertisement -

ఖైదీ 150తో వందకోట్లు వసూల్ చేసిన చిరు తన 151వ సినిమాతో కూడా తన సత్తా చాటేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రియల్ స్టోరీ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాకు సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ 150వ సినిమా కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో తన నెక్స్ట్ సినిమా కోసం చిరు చాలా కేర్ తీసుకుంటున్నాడు. ‘సైరా’ సినిమా కోసం చిరు ఫిటెనెస్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.అంతేకాదు రామ్ చరణ్ కూడా తండ్రితో పాటు జిమ్ లో పాల్గొంటున్నాడు.

Chiranjeevi Makeover For Sye Raa

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ని డిసెంబర్ 6న స్టార్ట్ చేయడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్నాడు. అయితే మెగాస్టార్ ఫస్ట్ లుక్ కోసం చాలా కష్టపడుతున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఒక ఫొటోని చూస్తే మనకే అర్ధమవుతోంది. ఆరు పదుల వయసు దాటినా కూడా మెగా స్టార్ ఒక యోధుడిగా కనిపిస్తున్నాడు అనే భావన కలుగుతోంది.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రకు కరెక్ట్ గా సెట్ అయ్యేలా మెగాస్టార్ తన బాడీ షేప్ ను మార్చుకున్నారు. తప్పకుండా సినిమాలో ఆయన అందరికి నచ్చేలా కనిపిస్తారని చిత్ర యూనిట్ చాలా నమ్మకంతో ఉంది. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన ఒక సెట్ లో సినిమా మొదటి షూట్ స్టార్ కానుంది. నిర్మాత రామ్ చరణ్ దర్శకుడు సురేందర్ రెడ్డి అందుకు ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకున్నారు.

- Advertisement -