- Advertisement -
అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాశ్ పూరి, కేతికా శర్మజంటగా నటిస్తున్న చిత్రం `రొమాంటిక్`. `ఇస్మార్ట్ శంకర్` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా హైదరాబాద్, గోవా షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకోగా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమాలో జాయిన్ కానుంది శివగామి రమ్యకృష్ణ. బాహుబలి తర్వాత పూరి తనయుడు మూవీకి సంతకం చేసింది. తాజా షెడ్యూల్‌లో చిత్రయూనిట్‌తో జాయిన్ అయింది రమ్యకృష్ణ. ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర కీలకంగా ఉండనుందట. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నరేశ్ సినిమాటోగ్రఫీని అందించారు.
- Advertisement -