తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. ప్రధాన ఆలయాలన్ని శ్రీరామ నామస్మరణతో మార్మోగి పోయాయి. దక్షిణ అయోధ్య భద్రాచలం మిథిలా స్టేడియంలో కన్నుల పండువగా శ్రీరాముని కళ్యాణమహోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. కల్యాణం కోసం సీతమ్మ వారిని స్వామి వారికి అభిముఖంగా పెళ్లి పీటలపై కూర్చోబెట్టారు. భక్తుల హర్షధ్వానాల మధ్య సీతమ్మకు మాంగల్యధారణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో మాంగళ్యధారణ చేశారు శ్రీరామచంద్రమూర్తి.
రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సతీసమేతంగా భద్రాద్రి శ్రీసీతారాములకు పట్టువస్ర్తాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్ తో పాటు పలువురు ఎంపీలు,ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
శ్రీరామచంద్ర జగత్ కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో భద్రాద్రికి తరలివచ్చారు.శ్రీరామ నామస్మరణతో మిథిలా నగరం మార్మోగిపోయింది. సీతారాముల కల్యాణ మహోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి సువర్ణ ద్వాదశ వాహనంపై సీతారాముల ఊరేగింపు జరిగింది.
ఇవి కూడా చదవండి..