ఇండిగో సంక్షోభంపై సమగ్ర విచారణకు ఆదేశించామన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. ఇండిగో సీఈఓ, సీఓఓలకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు ఇచ్చింది… నిబంధనలు ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తాం అన్నారు.
లోక్‌సభలో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. ఈ సంక్షోభానికి కారణం ఇండిగో అంతర్గత రోస్టరింగ్ లోపాలేనని తెలిపారు. ఈ సంక్షోభంపై స్పందన కోరుతూ, ఎయిర్‌లైన్ సీనియర్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
ఇండిగో తాజా కార్యకలాప వైఫల్యాల వల్ల కలిగిన అంతరాయం ఇప్పుడు వేగంగా స్థిరపడుతోంది అని ఈ గౌరవనీయ సభకు తెలియజేయాలనుకుంటున్నాను. బాధ్యత ఖచ్చితంగా నిర్ధారించబడుతుంది. DGCA ఇప్పటికే ఇండిగో సీనియర్ నాయకత్వానికి షోకాజ్ నోటీసులు ఇచ్చి, సమగ్ర విచారణ ప్రారంభించింది. దాని ఫలితాల ఆధారంగా, విమానయాన చట్టం మరియు నియమాల ప్రకారం కఠినమైన, తగిన చర్యలు తీసుకోబడతాయి అని రామ్మోహన్ లోక్‌సభలో వెల్లడించారు.
ఎంత పెద్ద ఎయిర్‌లైన్ అయినా సరే, ప్రణాళికా వైఫల్యాలు, నియమాల ఉల్లంఘనలు లేదా చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రయాణికులకు ఇలాంటి ఇబ్బందులు కలగడానికి అనుమతి ఇవ్వబడదు అని ఆయన అన్నారు.
Also Read:జపాన్‌లో భూకంపం..ప్రభాస్ సేఫ్

