Harish:కేసీఆర్ అంటే త్యాగం..రేవంత్ అంటే ద్రోహం

6
- Advertisement -

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన దీక్షా విజయ్ దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి, అంబేద్కర్ చిత్రపటానికి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నవంబర్ 29 కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు అన్నారు.

తెలంగాణ ఉద్యమం అంటేనే కేసీఆర్ గారి త్యాగం.. ఆయన చేసిన పోరాట ఫలితమే నేటి తెలంగాణ.. నా శవం మీద తెలంగాణ జెండా కప్పండని ప్రాణ త్యాగానికి తెగించి పోరాడిన గొప్ప నాయకుడు కేసీఆర్… కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, రేవంత్ అంటే ద్రోహం,, సమైక్యవాదుల బాటలో నడుస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు రేవంత్ రెడ్డికి లేదు.. అది పోరాటంలో పుట్టిన భావోద్వేగం… నాడు ఉద్యమకారులపై తుపాకీ పట్టుకున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి.. నేడు తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారు. అమెరికాలో మన బిడ్డలను జైల్లో వేసిన ట్రంప్ పేరును హైదరాబాద్ రోడ్డుకు పెడతావా? ఇది భారతీయులను అవమానించడమే.. నాడు తెలంగాణ వెనుకబడ్డది కాదు వెనుకబడేయబడ్డది.. నేడు రేవంత్ పాలనలో మళ్లీ వెనుకబాటుకు గురవుతోంది అన్నారు.

చరిత్ర గురించి మాట్లాడితే కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. కానీ రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, రేవంత్ అంటే ద్రోహం. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామాలు చేయమంటే జిరాక్స్ పేపర్లు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఉద్యమకారుల మీద రైఫిల్ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి ఆయన. అలాంటి వ్యక్తి నేడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తూ చరిత్ర హీనుడిగా మిగిలిపోతున్నాడు. ​తెలంగాణ తల్లి ఉద్యమ భావోద్వేగాల మధ్య, పోరాట స్ఫూర్తితో పుట్టిన రూపం. ప్రజలు స్వచ్ఛందంగా ఊరూరా, వాడవాడలా విగ్రహాలు పెట్టుకొని పూజించుకుంటున్న తల్లిని రేవంత్ రెడ్డి మార్చాలనుకోవడం దుర్మార్గం. రేవంత్ సృష్టించినది నకిలీ తల్లి, ఆ తల్లి చేతిలో నుండి మన సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను తీసేసిన దుర్మార్గుడు రేవంత్ అని మండిపడ్డారు.

జై తెలంగాణ అనని, ఉద్యమంలో జైలుకు వెళ్ళని రేవంత్ రెడ్డికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు లేదు. ఎన్నికల ముందు తలరాతలు మారుస్తానని చెప్పి, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నాడు. చేసింది శూన్యం.. ఎరువుల కొరత తెచ్చాడు, విత్తనాల ధరలు పెంచాడు, కరెంటు కోతలు తెచ్చాడు, రైతుబంధు ఎగ్గొట్టాడు. రైతు బీమా డబ్బులు కూడా కట్టకుండా రైతులను గోస పెడుతున్నాడు. కాకతీయ తోరణాన్ని, చార్మినార్ ను చిహ్నం నుంచి తొలగిస్తానంటాడు. రవీంద్ర భారతి కంటే రామోజీ ఫిలిం సిటీ గొప్పదని మాట్లాడి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు.కాళోజీ, దాశరథి, గద్దర్ లను చిన్నచేసి మాట్లాడుతున్నాడు. అమెరికాలో మన తెలుగు పిల్లలకు బేడీలు వేసి జైల్లో పెట్టిన ట్రంప్ పేరును హైదరాబాద్ రోడ్డుకు పెడతాడట. పన్నులు పెంచి, వీసాలు కఠినం చేసి భారతీయులను ఇబ్బంది పెడుతున్న ట్రంప్ పేరు పెట్టడం అంటే భారతీయులను అవమానించడమే. మన పిల్లల ఉద్యోగాలు ఊడగొడుతున్న వ్యక్తికి నీరాజనాలు పడతావా రేవంత్ రెడ్డి?, డిసెంబర్ 9న తెలంగాణ ఇస్తామని ప్రకటించి, ఆ తర్వాత వెనక్కి తీసుకున్న సోనియా గాంధీని నాడు బలి దేవత అన్నది రేవంత్ రెడ్డే. ఇప్పుడు ఆ సోనియా గాంధీకి గుడి కడతామంటున్నాడు. నాడు తెలంగాణ వెనక్కి తీసుకున్నప్పుడు మన యువకులు బలిదానాలు చేసుకున్నారు. సోనియాగాంధీ పేరు మీద ఉత్తరం రాసి ఏఐసీసీ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకున్నారు యాదిరెడ్డి. యాదిరెడ్డి పార్థివ దేహాన్ని ఏపీ భవన్ కు కూడా రానివ్వని దుర్మార్గపు పాలన అది. ఎన్ని త్యాగాలు, ఎన్ని పోరాటాలు. కేసీఆర్ గారు అంటేనే త్యాగాలు. బహుశా దేశంలో ఒక కాజ్ కోసం ఇన్ని పదవులకు రాజీనామా చేసిన నాయకుడు ఎవరైనా ఉంటే అది కేసీఆర్ గారే.
పదవులే కాదు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డ గొప్ప నాయకుడు కేసీఆర్. నిమ్స్ లో కేసీఆర్ గారికి సోడియం లెవెల్స్ తగ్గిపోయినాయి. కిడ్నీ ఫెయిల్ అయిపోతాయి మనిషి చనిపోతాడని డాక్టర్లు మాకు చెప్పారు. నేను పోయి కేసీఆర్ గారికి దీక్ష విరమించుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తే, నాకే తిరిగి ధైర్యం చెప్పి తెలంగాణ వచ్చేవరకూ నా ప్రాణం పోదు మనం కొట్లాడుదామని అన్నాడు కేసీఆర్. అయితే జైత్రయాత్ర లేకపోతే శవయాత్ర అని కేసీఆర్ గారు తేల్చి చెప్పారు. నా శవం మీద తెలంగాణ జెండా కప్పండని చెప్పిన గొప్ప నాయకుడు. ఆయన ఉద్యమంలో ఆమరణ దీక్ష వల్ల, పోరాటం వల్ల వారి ఆయుష్షు పది సంవత్సరాలు తగ్గింది అన్నారు.

దేవుని దయవల్ల, తెలంగాణ ప్రజల ఆశీస్సుల వల్ల చాలా ఆరోగ్యంగా ఉన్నారు కేసీఆర్ గారు ఇప్పుడు. తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ పోరాటం చేస్తారు. కచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పదాన్నే నిషేధించారు. తెలంగాణ వెనుకబడ్డది కాదు వెనుకబడేయబడ్డదని జయశంకర్ సార్ చెప్పేవారు. కేసీఆర్ గారి పోరాటం వల్ల, తెలంగాణ రావడం వల్లే నేడు 24 గంటల కరెంటు, ఇంటింటికి నీళ్ళు, కోటి ఎకరాల మాగాణి సాధ్యమైంది. తలసరి ఆదాయంలో, వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది. కానీ నేడు రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణను మళ్లీ వెనుకబడేసే కుట్ర జరుగుతోంది.సమైక్యవాదుల బాటలో నడుస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు. ప్రజల పక్షాన కేసీఆర్ గారు మళ్ళీ పోరాటం చేస్తారు, కచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటుంది అన్నారు.

- Advertisement -