మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన ‘పెద్ది’ గ్రాండ్ సక్సెస్ మీట్‌లో రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమా వివాదంపై స్పందించడమే కాకుండా తన కుమార్తె క్లిన్ కారా గురించి ఒక తమాషా ముచ్చటను పంచుకున్నారు.
ఈ సినిమా తన కెరీర్‌ను మరియు జీవితాన్ని ఎంతగానో మార్చేసిందని రామ్ చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు. మీరు ఈ సినిమాను ఎంత పెద్ద సక్సెస్ చేశారంటే.. భవిష్యత్తులో రామ్ చరణ్‌ను మర్చిపోయి కేవలం ‘పెద్ది’ అనే గుర్తుంచుకుంటారేమోనని నాకు భయమేస్తోంది అని నవ్వుతూ అన్నారు.
అంతేకాదు నేను ఈ మార్పును నా ఇంట్లోనే స్వయంగా అనుభవిస్తున్నాను. సినిమా విడుదలయ్యే వరకు నా చిన్నారి క్లిన్ కారా నన్ను ‘నాన్న’ అని పిలిచేది. కానీ ఇప్పుడు నన్ను చూడగానే ‘ఏయ్ పెద్ది’ అంటోంది. అలా పిలవద్దు నాన్నా అని చెప్తే.. ఇప్పుడు పెద్ది నాన్న అని పిలుస్తోంది. కాబట్టి నా కూతురు కూడా నా అసలు పేరు మర్చిపోయింది అని చరణ్ సరదాగా చెప్పారు. ఈ మాటలకు వేదికపై ఉన్న మెగాస్టార్ చిరంజీవి కూడా నవ్వేశారు.
Also Read:రామాలయ విరాళాలకు ‘రికార్డులు’ లేవు!

