అమెరికా వస్తువులపై భారతదేశం విధిస్తున్న దిగుమతి సుంకాల (టారిఫ్‌లు) విషయంలో యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్….ప్రభుత్వ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్‌పై తీవ్రంగా మండిపడ్డారు. అధికారిక లెక్కలను ఆయన నమ్మడానికి నిరాకరిస్తూ అవి కేవలం “అబద్ధపు అంకెలు” అని కొట్టిపారేశారు.
యూనైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) కార్యాలయం రికార్డు చేసిన దానికంటే భారతదేశ టారిఫ్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. తనకు చైనా ఎంత టారిఫ్ వేస్తోంది, ఇండియా ఎంత వేస్తోందనే కచ్చితమైన నిజాలు ఎవరూ ఇవ్వడం లేదు. మీరంతా నాకు అబద్ధపు లెక్కలు ఇస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:రామాలయ విరాళాలకు ‘రికార్డులు’ లేవు!
అమెరికా వస్తువులపై భారత్ కనీసం 175 శాతం లేదా అంతకంటే ఎక్కువ సుంకాలు విధిస్తోందని ట్రంప్ తెలిపారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో అమెరికాపై అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్న దేశాలలో భారతదేశం ఒకటి. భారత్ వ్యవసాయ ఉత్పత్తులపై సగటున 37% మరియు కొన్ని రకాల ఆటోమొబైల్స్‌పై 100% కంటే ఎక్కువ టారిఫ్‌లను విధిస్తోంది.

