చరణ్ క్లారిటీ.. పాపం బుచ్చిబాబు

41
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమా ఇప్పటికే ఖరారు అయింది. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా మీద వీర లెవెల్ లో గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. అసలు ఈ సినిమా వుంటుందా అనే అనుమానాలు కూడా వినిపించేస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సరైన స్క్రిప్ట్ తయారు చేసి రామ్ చరణ్ ను ఒప్పించలేకపోతున్నారు అన్నదే దీనికి కారణం అంటున్నారు. దీని మీద రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి. బుచ్చిబాబు తాను స్వయంగా స్క్రిప్ట్ తయారీ మీద కూర్చోకుండా ఓ టీమ్ ను పెట్టుకుని పనులు అప్పగిస్తున్నాడు.

దాంతో స్క్రిప్ట్ లో చాలా వెర్షన్స్ వచ్చేశాయి. ఏ వెర్షన్ ను ఫైనల్ చేయాలి అనేది బుచ్చిబాబుకి కూడా అర్ధం కావడం లేదు. స్క్రిప్ట్ మొత్తం పకడ్బందీగా చేయమని చరణ్ టైమ్ కూడా ఇచ్చాడు. కానీ, బుచ్చిబాబు మాత్రం ప్రస్తుతం గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే, రీసెంట్ గా స్క్రిప్ట్ వినిపించేందుకు బుచ్చిబాబు రెడీ అయినా చరణ్ మాత్రం ఇప్పుడే వద్దని, మరింత సమయం తీసుకోమన్నారని బోగట్టా. మొత్తమ్మీద చరణ్ మాత్రం స్క్రిప్ట్ మీద చాలా పర్టిక్యులర్ గా వున్నారని, మొత్తం బౌండ్ స్క్రిప్ట్ ఇస్తే తప్ప సెట్ మీదకు వెళ్లడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది.

Also Read: విజయ్‌కి సమంత స్పెషల్ విషెస్..

అవసరం అయితే బుచ్చిబాబుతో సినిమా ఆపేసి మరో సినిమా మీదకు అయినా వెళ్తా కానీ, స్క్రిప్ట్ సంతృప్తి నివ్వకుండా సినిమా చేసేది లేదని చరణ్ క్లారిటీగా చెప్పాడట. బుచ్చిబాబు కొత్త దర్శకుడు. అతని మొదటి సినిమా ఉప్పెన హిట్ అవ్వొచ్చు. అది చిన్న బడ్జెట్ సినిమా. కానీ, చరణ్ తో ప్లాన్ చేసేది 150 కోట్ల సినిమా. ఆ రేంజ్ సినిమా చేయాలి అంటే.. మ్యాటర్ తో పాటు అనుభవం కూడా ఉండాలి. ఇక్కడే, బుచ్చిబాబు ఫెయిల్ అవుతున్నాడు. మరి చివరకు ఏం అవుతుందో చూడాలి.

Also Read: ఆ దర్శకుడికి యాంకర్ శాపం

- Advertisement -