శ్రీమంతంలో అదరగొట్టిన రంభ డ్యాన్స్

268
rambha

రంభ… ఒకప్పుడు అలనాటి టాప్‌ హీరోలందరితో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన ముద్దుగుమ్మ. 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త, తమిళుడు ఇంద్రన్ కుమార్‌ను పెళ్లి చేసుకుంది. 2016లో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకుల వరకు వెళ్లారు. రంభ చైన్నైలోని ఫ్యామీలీ కోర్టును ఆశ్రయించింది. తన పిల్లల సంరక్షణ కోసం భర్త నుంచి నెలకు రూ. 2.50 లక్షలు ఇప్పించాలని కోర్టును కోరింది. ఈ కేసుపై ఇటీవలి వరకు విచారణ జరిగింది.చివరివరకు చర్చలు జరిపించిన కోర్టు ఇంకోసారి కలసి కూర్చుని అవగాహనకు రావాలని సూచించింది. తమ ఇద్దరు కూతుళ్ల భవిష్యత్తు, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకున్న జంట తాము కలసి ఉంటామని కోర్టుకు తెలిపింది.

 rambha dance

దీంతో కేసును కొట్టివేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. ప్రస్తుతం రంభ తన భర్త, పిల్లలతో సంతోషంగా ఉంది. రంభకు లాన్య(7) శాషా(3) అనే కూతుళ్లు ఉన్నారు. కుటుంబసభ్యులు సోమవారం రంభ శ్రీమంతాన్ని ఘనంగా జరిపారు. ఆ వేడుకలో ఇంద్రన్ భార్యపై పూల వర్షం కురిపించాడు. అంతేకాకుండా రంభ తన కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా డ్యాన్స్ చేసిందిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టగా, అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.