కాంగ్రెస్ తో రాహుల్ పెళ్లి

288
rahul gandhi marriage
- Advertisement -

మోస్ట్‌ ఎలిజిబిల్‌ బ్యాచిలర్‌ రాహుల్‌ గాంధీ పెళ్లిపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి నెలకొని ఉంది. నాలుగు పదుల వయస్సు వచ్చినా రాహుల్‌ గాంధీ పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదనే ప్రశ్న సాధారణంగా అందరిలో నెలకొని ఉంది. అయితే తాజాగా రాహుల్‌ గాంధీయే స్వయంగా తన పెళ్లిపై స్పందించాడు. తనకు పెళ్లయిపోయిందని చెప్పాడు. దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. రాహుల్‌ గాంధీకి పెళ్లయిందా.. అమ్మాయి ఎవరూ అంటూ ఆశ్చర్యంతో చూశారు. అయితే రాహుల్‌ గాంధీ తనకు కాంగ్రెస్‌ పార్టీతో పెళ్లయిందని క్లారిటీగా చెప్పడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.

rahul gandhi marriage

ఇవాళ హరితప్లాజాలో జరిగిన పత్రికా సంపాదకుల సమావేశంలో రాహుల్‌గాంధీ ఓ పత్రికా సంపాదకులు రాహుల్‌ గాంధీని మీరు ఎప్పుడూ పెళ్లి చేసుకుంటారని అడిగిన ప్రశ్నకు రాహుల్‌ సమాధానమిస్తూ తనకు కాంగ్రెస్‌ పార్టీతో పెళ్లయిందని సమాధానం ఇచ్చారు. దీంతో పాటు రాబోయే ఎన్నికల్లో దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కష్టమని, 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టిన హామిలను ఒక్కటి కూడా అమలు చేయలేదని దీంతో దేశ వ్యాప్తంగా ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకభావం ఉందని, ఇప్పుడు ప్రజలందరూ కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నారని, కాంగ్రెస్‌తోనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని రాహుల్‌ పేర్కొన్నారు. 2019లో తిరిగి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని రాహుల్‌ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -