ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్

199
ntr fist look
- Advertisement -

బాలకృష్ణ ప్రధాన పాత్రలో, క్రిష్‌ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు బయోపిక్‌ ఎన్టీఆర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే స్వాతంత్ర్య దినోత్సవ దినోత్సవం సందర్భంగా పంద్రాగస్టు శుభాకాంక్షలతో ఎన్టీఆర్‌ సినిమా ఫస్టు లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

ఈ ఫస్ట్‌ లుక్‌లో బాలకృష్ణ అద్భుతమైన హావాభావాలతో స్టేజిపై ప్రసంగిస్తూ అచ్చం ఎన్టీఆర్‌ను తలపిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఎన్టీఆర్‌లాగా నటించిన బాలయ్యబాబును చూసిన ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తోండగా, ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తోంది.

- Advertisement -