టీఆర్పీలో రామాయణ్‌ టాప్…!

429
ramayan
- Advertisement -

కరోనా ఎఫెక్ట్‌తో ఇంట్లో ఉండి బోర్ కొట్టే వారి కోసం రామాయణ్‌, మహాభారత్‌ సీరియల్స్‌ పునఃప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. దూరదర్శన్‌లో 33 ఏళ్ల కిందట ప్రసారమైన ఈ సీరియళ్లు ఓ చరిత్రను సృష్టించాయి.

ఉదయం 9-10 గంటల మధ్య ఒక ఎపిసోడ్… రాత్రి 9-10 గంటల మధ్య మరో ఎపిసోడ్‌ను ప్రసారం చేస్తున్నారు. అప్పట్లో దేశం మొత్తాన్ని టీవీలకు కట్టిపడేసిన ఈ సీరియల్ ఇప్పుడు కూడా అదే రీతిలో ప్రసారం అవుతోంది. మొదటి రెండు ఎపిసోడ్లను 34 మిలియన్ల మంది చూడగా.. మొదటి వారంలో ఈ సీరియల్‌ను 8.5 కోట్ల మంది చూశారు. దేశ చరిత్రలో మరే సీరియల్‌కు కూడా ఇన్ని కోట్ల వ్యూస్ రాలేదు.

టీఆర్పీ రేటింగుల్లో ఎవరూ ఊహించని రీతిలో అగ్రస్ధానానికి దూసుకెళ్లింది దూరదర్శన్. రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన రామాయణ్‌ సీరియల్ ఒక్క ఎపిసోడ్ నిర్మించడానికి దాదాపు రూ.9 లక్షలు ఖర్చు అయ్యింది. ఈ సీరియల్‌ను 500 రోజులపాటు ఎంతో శ్రమించి చిత్రీకరించారు. వారానికి ఒకటి చొప్పున మొత్తం 78 ఎపిసోడ్‌లను రామానంద్ సాగర్ నిర్మించారు.

- Advertisement -