సౌదీ రాజు ఫ్యామిలీలో 150 మందికి కరోనా..!

189
saudi arab prince

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా దాదాపుగా 209 దేశాలకు విస్తరించింది. ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 16 లక్షలు దాటగా కరోనా మృతుల సంఖ్య 96వేలకు చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 3.55 లక్షల మంది కోలుకున్నారు.అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4.68 లక్షలు దాటగా 16,663 మంది మృతి చెందారు.

ఇక సౌదీ రాజ కుటుంబంలో 150మందికి కరోన పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. వీరిలో కొంతమంది తీవ్రంగా జబ్బు పడగా మరి కొందరి పరిస్థితి సాధారణంగానే ఉందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

రియాద్ గవర్నర్ సీనియర్ యువరాజు ఐసీయూ లో ఉండగా రాజు సల్మాన్ కూడా ఐసోలేషన్ లో ఉన్నట్టు సమాచారం. సౌదీలో ఇప్పటివరకు మొత్తం 2932 మందికి కరోనా రాగా 631 మంది వైరస్ నుండి కోలుకున్నారు.