ఇండియా- పాక్‌ మ్యాచ్‌..కపిల్ సెటైర్లు..!

164
kapil

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు విరాళాలు సేకరించడంలో భాగంగా భారత్- పాకిస్థాన్ మధ్య వన్డే సిరీస్ నిర్వహించాలని పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

ఇక అక్తర్ ప్రతిపాదనపై తనదైన శైలీలో సెటైర్లు వేశాడు భారత మాజీ ఆటగాడు కపిల్ దేవ్. కరోనాకు వ్యతిరేకంగా పోరాడటానికి నిధులకోసం పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడాల్సినంత గతి ఇంకా భారత్ కు పట్టలేదు అని తెలిపాడు. కరోనాను ఎదుర్కొనేందుకు బీసీసీఐ దగ్గర కావాల్సిన డబ్బులు ఉన్నాయని…పీఎం సహాయనిధికి రూ. 51 కోట్లు విరాళంగా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశాడు కపిల్.

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరో ఐదు నెలల వరకు అసలు క్రికెట్ గురించి మర్చిపోతే బాగుంటుందని పేర్కొన్నాడు. ఈ సమయం లో మ్యాచ్ కంటే ముందు ఈ రెండు దేశాలు పరస్పరం ఎలా సహాయం చేసుకుంటాయి అనేది చూడాలి అని అన్నాడు.