రామారావు ఆన్ డ్యూటీ..క్రిస్మస్ ట్రీట్

165
ramarao
- Advertisement -

మాస్‌ మహారాజా రవితేజ, దర్శకుడు శరత్‌ మండవ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. దివ్యాంశా కౌశిక్, రాజీషా విజయన్‌ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలోనే ఉన్నప్పటికీ, ఈ చిత్రంపై ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇందుకు తగ్గట్లుగానే చిత్రయూనిట్‌ కూడా ఎగ్రెసివ్‌ ప్రొమోషన్స్, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ ప్రేక్షకులు అటెన్షన్‌ను గ్రాబ్‌ చేస్తుంది. తన ఎనర్జీ, కామిక్‌ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో నటుడిగా మంచి ఆదరణ, గుర్తింపు తెచ్చుకున్న తొట్టెంపూడి వేణు ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రంలో ఓ కీలక పాత్రలో న‌టిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ చిత్రం మార్చి 25, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిస్మస్ కానుకగా స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది.

- Advertisement -