ఎట్టకేలకు వరుణ్..గని రిలీజ్ డేట్ ఫిక్స్‌

45
varun

టాలీవుడ్‌ మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ ప్రస్తుతం ‘గని’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ కంపెనీ, రినైసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కుతోంది.. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో ఆసక్తికరమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో సయూ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది.

ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తికాగా పలుమార్లు విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. 2022 మార్చి 18న విడుదల కానుంది.