మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన రామకృష్ణ మఠం సేవకులు..

111
- Advertisement -

మంగళవారం రామకృష్ణ మఠంకు చెందిన స్వచ్ఛంద సేవకులు హైదరాబాద్‌లో రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను తన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ లోని మహబూబ్ కళాశాలలో నిర్వహించిన ఆధ్యాత్మిక సమావేశం ‘My Mission to the West’ను వివేకానంద దినోత్సవం’గా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని రామకృష్ణ మఠం ప్రతినిధులు మంత్రిని కోరారు.

ప్రతియేటా ఫిబ్రవరి 10 నుంచి 17 వరకు వివేకానంద వారోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, నారాయణ రావు, శ్రీధర్‌లు పాల్గొన్నారు.

- Advertisement -