రాష్ట్రంలో రైతుల ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం తీరుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయ లోక్ సభలో టిఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ద్వజమెత్తారు. 60 రోజులుగా రైతుల ధాన్యం సేకరణ చేయాలని కోరుతున్న కేంద్రం పట్టించుకోవడం లేదు. అందుకే పార్లమెంట్ వేదికగా నిరసన తెలుపుతున్నామని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ప్రకటన చేస్తే చర్చలకు సిద్ధం.. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలి. కేంద్ర ప్రభుత్వం ఇక్కడో రకంగా.. తెలంగాణలో ఇంకో రకంగా చెబుతోంది అన్నారు. ద్వంద నీతి అవలంభిస్తోంది. ధాన్యం కొనుగోలుపై కేంద్రం సభలో ప్రకటన చేయాలని స్పీకర్ ద్వారా కేంద్రాన్ని కోరుతున్నామని నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.