రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో వలస కూలీల ఆకలి దప్పికలు తీర్చడానికి నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.అందులో భాగంగా ఈరోజు ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఎస్ గార్డెన్‌లో వలస కూలీలకు అన్నదానం చేశారు.పోలీస్ కమిషనర్ సత్యనారాయణ లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో పనులు లేక ఆర్థికంగా నష్ట పోయి తమ సొంత రాష్ట్రాలకు ట్రైన్ ద్వారా వెళుతున్న జార్ఖండ్,బీహార్,ఒరిస్సా,ఉత్తరప్రదేశ్,వెస్ట్ బెంగాల్ వలస కూలీలకు భోజనలను అందించారు.
కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ ద్వారా వలస కార్మికులను గుర్తించి ఆకలితో సరిహద్దులు దాటకుండా భోజనం, సదుపాయాలు కల్పించి, వారి వారి రాష్ట్రాల అధికారులతో మాట్లాడి స్వగ్రామాలకు పంపించడం జరుగుతుందని సిపి అన్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ వారికి సహకరిస్తూ వలస కార్మికుల కడుపులు నింపడానికి మరియు ఆకలిని తీర్చడానికి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపితో పెద్దపల్లి డిసిపి రవీందర్, గోదావరిఖని ఏసిపి ఉమెందర్, ఏఆర్ఏసిపిడి సుందర్రావు, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు, గోదావరిఖని పట్టణ సిఐ రమేష్, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.