మొక్కలు నాటిన రామగుండం మున్సిపల్ కమిషనర్

243
ramagundam

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు రామగుండం మున్సిపల్ కమిషనర్ భువనగిరి శ్రీనివాసరావు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి ఈ రోజు మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా కమీషనర్ బోనగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని తెలిపారు. ఎంపీ సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అని. ఈ సందర్భంగా సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.