కేంద్రమంత్రి, లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధినేత రాం విలాస్ పాశ్వాస్ (74) కన్నుమూశారు. ఇటీవలే ఆయన ఢిల్లీలోని ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. ఐదు దశాబ్దాలకుపైగా క్రీయాశీలక రాజకీయాల్లో ఉన్నారు. గత ఐదు వారాలుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు లోక్‌జనశక్తి పార్టీ చీప్ చిరాగ్ పాశ్వాన్ తండ్రి మరణాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు.
దేశంలోని ప్రముఖ దళిత నాయకుల్లో పాశ్వాన్ ఒకరు. బిహార్ నుండి ఎనిమిది సార్లు లోక్‌సభ సభ్యునిగా,ఓసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. బిహార్‌లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 1969 లో అలౌలి (ఖాగారియా) నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. తర్వాత 1974 లో లోక్ దళ్ ఏర్పడిన తరువాత దానిలో చేరి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. 1977,1980, 1989, 1996, 1998, 1999, 2004, 2014లో పార్లమెంటు సభ్యునిగా ఎంపికయ్యారు.
2000 లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) ని స్థాపించి దాని అధ్యక్షుడిగా ఉన్నాడు. తదనంతరం 2004 లో యుపీఏలో చేరి కేంద్రమంత్రిగాగా పనిచేశారు. 2014లో హాజీపూర్‌ని నుండి ఎంపికైన పాశ్వాన్ ప్రస్తుతం ఎన్డీఏలో కేంద్రమంత్రిగా ఉన్నారు.