రాష్ట్రంలో కొత్తగా 5,292 పాజిటివ్ కేసులు

102
covid 19

గత కొద్దివారాలుగా ఏపీలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా 5,292 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. మొత్తంగా చూస్తే… మొత్తం మరణాల సంఖ్య 6,128కి పెరిగింది. ఇప్పటివరకు 7,39,719 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,84,930 మందికి కరోనా నయం అయింది. ఇంకా 48,661 మంది చికిత్స పొందుతున్నారు.

అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 784 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 175 కేసులు వచ్చాయి. తాజాగా 6,102 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, రాష్ట్రంలో 42 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో ఆరుగురు మరణించారు.