Ram Temple:రాముడి విగ్రహ ఊరేగింపు రద్దు

30
- Advertisement -

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలోని ప్రముఖులందరికి అయోధ్య రామాలయానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. అయితే రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న అయోథ్యలోని ప్రధాన వీధుల గుండ ఊరేగింపు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే తాజాగా అయోధ్య వాసులకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బ్యాడ్ న్యూస్ చెప్పింది.

ఉరేగింపు కార్యక్రమాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు ట్రస్ట్ స్పష్టం చేసింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో నగరానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని.. భక్తుల రద్దీ కారణంగానే ఉన్నతాధిధికారుల సూచనలతో ఊరేగింపును రద్దు చేస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది.

భారీగా తరలివస్తున్న భక్తుల మధ్య నుంచి అయోధ్య రాముడి ఊరేగింపు జరిపితే భద్రతా పరంగా సమస్యలు తలెత్తుతాయని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

Also Read:Nikki Thamboli Pics Latest

- Advertisement -