ఓటీటీలోకి వచ్చేసిన ‘స్కంద’

19
- Advertisement -

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ స్కంద. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగలగా రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీగా నిలిచింది. దీని తోడు పాన్ ఇండియా లెవల్లో సినిమా రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద బొక్క బొర్లా పడింది.

ఈ చిత్రం థియేట్రికల్ రన్ అనంతరం ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి లో అయితే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హాట్ స్టార్ కొనుగోలు చేయగా తెలుగు సహా హిందీ మరియు తమిళ్ కన్నడ మళయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మాస్ ఎంటర్టైనర్ ని అప్పుడు మిస్ అయితే ఈసారి చూడవచ్చు.

తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాణం వహించింది. ఇక స్కందనే బాక్సాఫీస్ వద్ద బోళ్తా కొట్టగా దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు బోయపాటి.

Also Read:3న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

- Advertisement -