ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థీగా బిహార్ గవర్నర్ రామనాథ్ కోవింద్‌ను బీజేపీ ప్రకటించింది. బీజేపీ పార్లమెంటరీ సమావేశం ముగిసిన తరువాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం బీహార్ గవర్నర్‌గా రామ్‌నాథ్ కోవిద్‌ను ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది.
ప్రధాని నరేంద్ర మోడీ 24వ తేదీన విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన పర్యటనకు ముందే అభ్యర్థిని ప్రకటించాలని బిజెపి భావిచింది. ఎన్నో ఊహాగానాలు.. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎందరో పేర్లు తెరపైకి వచ్చాయి. మిత్రపక్షాలతో పాటు యూపీఏ పక్షాలతోను బిజెపి చర్చలు జరిపింది. కానీ అనూహ్యంగా రామ్‌నాథ్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రకటించింది. 12 ఏళ్ల పాటు ఆయన రాజ్యసభ సభ్యుడిగా.. నాలుగేళ్లపాటు బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా కూడా పని చేశారు కోవిద్. దళితుల హక్కుల కోసం పోరాడిన రామ్ నాథ్… బీజేపీలో కీలకమైన దళిత నేతగా ఎదిగారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కూడా ఆయన న్యాయవాదిగా పని చేశారు.