దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు, రాజకీయనాయకులు, రాజకీయాలతోనే తీరిక లేని సమయంతో గడుపుతుంటారు.. ఇక వారికి సినిమాలు చూసేంత టైమ్ ఎక్కుడుంటుంది.. కానీ ఒక దేశానికి అధ్యక్షుడు అయి ఉండి ఎంచక్కా సినిమా సెట్స్‌లో సందడి చేశాడు.. ఇంతకు అతడు ఏ దేశానికి అధ్యక్షుడు అని అనుకుంటున్నారా.. అతను మన దేశాధ్యక్షుడే.. అవును భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిందే..
ప్రస్తుతం బల్గేరియా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తాను పర్యటిస్తున్న ప్రాంతానికి దగ్గరలో భారతదేశ సినిమా షూటింగ్ అవుతుందని తెలుసుకుని బల్గేరియా ప్రెసిడెంట్ రాదేవ్‌తో కలిసి సినిమా షూటింగ్‌ను చూడడానికి వెళ్లారు. రణ్ బీర్ కపూర్, అలియాభట్, మౌనీరాయ్, నాగార్జున, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కుతున్న మూవీ బ్రహ్మాస్త్రా. ఈ మూవీ కరణ్ జోహార్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతోంది ఈ మూవీ. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సినిమా షూటింగ్ సెట్స్‌లో బ్రహ్మస్త్ర టీంతో కలిసి ఫోటోలు దిగారు. అందరితో మాట్లాడారు. ఈ ఫోటోలను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తమ అఫీషియల్ ట్విట్టర్లో ఫోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఇరు దేశాల అధ్యక్షులు సినిమా అనేది రెండు దేశాల మద్య బిజినెస్, కల్చరల్ లింక్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
#PresidentKovind and President Radev dropped in at the studio in Sofia where the Hindi film Brahmastra is being made. The Presidents met the Indo-Bulgarian crew and chatted about cinema as a business and cultural link between the two countries pic.twitter.com/8ApZq1gEJA
— President of India (@rashtrapatibhvn) September 5, 2018