స్వలింగ సంపర్కంపై సుప్రీం సంచలన తీర్పు..

305
homosex
- Advertisement -

స్వలింగ సంపర్కులపై దేశ సర్వొన్నత న్యాయస్ధానం సుప్రీం సంచలన తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కం నేరం కాదని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయం పడింది. నలుగురు న్యాయమూర్తులు స్వలింగ సంపర్కం నేరం కాదని అభిప్రాయాన్ని వెలిబుచ్చగా ఒకరు మాత్రం వ్యతిరేకించారు.

వ్యక్తిగతంగా తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని తీర్పులో పేర్కొంది. భావవ్యక్తీకరణను నిరాకరించడం అంటే అది మరణంతో సమానమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ చర్య ఐపీసీ సెక్షన్ 377 పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. కాలానికి అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేయాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

స్వలింగ సంపర్కాన్ని సమర్ధిస్తూ 2013లో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. స్వలింగ సంపర్కం సెక్షన్ 377 కిందకు రాదని తేల్చి చెప్పింది. అయితే ఈ తీర్పును గతంలో సుప్రీం తోసిపుచ్చింది. దీనికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో ఎన్నో పిటిషన్లు దాఖలయ్యాయి.దీంతో ఇవాళ తుది విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది.

- Advertisement -