వాస్తవంలోకి వచ్చేయ్ రామ్

32
- Advertisement -

హీరో రామ్, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌ లో తెర‌కెక్కిన మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ స్కంద‌ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదలైంది. నేటితో పది రోజుల రన్ పూర్తి అయింది. ఈపాటికే థియేటర్స్ నుంచి ఈ సినిమాని తీసేశారు. సినిమాకి విమర్శకులు రాసిన రివ్యూలు, ఇచ్చిన రేటింగ్ లు చూసిన తర్వాత, జనం నిర్ద్వంద్వంగా తిరస్కరించిన తర్వాత కూడా రామ్ ఇంకా రియాక్టిలోకి రాలేదు అని టాక్. తన సినిమా సూపర్ హిట్ అయింది అని, తనకు ఫ్యాన్స్ నుంచి ఫుల్ పాజిటివ్ కామెంట్స్ వచ్చాయని, తన కెరీర్ లోనే రామ్ భారీ ఓపెనింగ్స్ వచ్చాయని అంటున్నాడు.

అసలు, ఓ డిజాస్టర్ సినిమాలో నటించి కూడా.. తాను మంచి సినిమా తీశానని అని అటు బోయపాటి, ఇటు హీరో రామ్ ఇంకా నమ్ముతుండటం ఆశ్చర్యకరం. “స్కంద” విడుదల తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో రామ్ మాటలు వింటే ఈ సినిమా పోయింది అన్న వాస్తవాన్ని ఆయన ఇంకా ఒప్పుకోవడం లేదు అనిపిస్తోంది. ఇంకా రియల్టీలోకి రాలేదు. “నా సినిమా బాగా లేకపోతే డాష్ లా ఉంది అని నిర్మొహమాటంగా చెప్పే వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఫోన్ చేసి సినిమాని బాగా చేశావు భయ్యా అని చెప్పారు” అంటూ తన సినిమా ఆడుతుంది, బాగుంది అన్నట్లుగా హీరో రామ్ చెప్పుకొచ్చాడు.

రామ్ బ్రహ్మాండమైన హిట్స్ చాలా చూశారు. అలాగే ఫ్లాపులూ చూశారు. మరి ఇంకా ఫ్లాప్ ని ఫ్లాప్ అని ఒప్పుకునేందుకు ఎందుకు వెనకాడుతున్నారో. ఏది ఏమైనా రామ్ వాస్తవంలోకి వస్తే మంచిది. లేదు అంటే.. ఆడియన్స్ కి దూరం అయ్యే పరిస్థితి వచ్చేస్తోంది. అసలు రామ్ తన సినిమాల్లో లాజిక్ లు లేని వైనం గురించి ఎప్పట్లాగే తాను కన్విన్స్ అయి, ఎదుటివాళ్ళని కన్వీన్స్ చేశాననుకునే సమాధానం ఇచ్చారు.

Also Read:మహిళలల్లో మధుమేహం.. చాలా ప్రమాదం!

- Advertisement -