ప్రభాస్ – అనుష్క ఫోటోలు వైరల్

34
- Advertisement -

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్‌ పెళ్లి వార్త కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రభాస్ పెళ్లి అనుష్కతో జరిగితే బాగుంటుందని ఆశపడుతుంటారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే కొందరు ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఉపయోగించి ప్రభాస్, అనుష్కకు పెళ్లి జరిగినట్లుగా వీరికి ఒక పాప, బాబు ఉన్నట్లుగా ఫోటోస్ డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట షేర్ చేస్తూ #Pranushka అంటూ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ ‘శివుడు’ లుక్ ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాలో “మహాదేవుడి” పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా AIని వాడుతూ ఫ్యాన్స్ ప్రభాస్ ని ఏకంగా “శివుడి”గా మార్చేశారు. ఇక AIని పక్కన పెడితే విష్ణు అండ్ టీమ్ ప్రభాస్ ని శివుడిగా ఎలా చూపించబోతున్నారు అనేది చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాను(పార్ట్-1) డిసెంబర్ 22న విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

అన్నట్టు ప్రభాస్ నవంబర్ నుంచి హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాని స్టార్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల నటించబోతుంది. ఇప్పటికే ఆమె వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తాజాగా ఆమె చేతికి ఈ పెద్ద ప్రాజెక్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. కాగా ప్రేమ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. శ్రీలీల పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందట. మరి ఈ సినిమా హిట్ అయితే, ఇక శ్రీలీల రేంజ్ మారిపోయినట్టే.

Also Read:మహిళలల్లో మధుమేహం.. చాలా ప్రమాదం!

- Advertisement -