దేశవ్యాప్తంగా అయోధ్య రామమందిర విరాళాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రజలను భాగస్వాములను చేస్తూ విరాళాల పర్వం కొనసాగుతుండగా ఇప్పటివరకు వచ్చిన విరాళాల సంఖ్య రూ. 1511 కోట్లు అందాయని రామతీర్ధ కేత్ర ట్రస్ట్ నిర్వాహకులు వెల్లడించారు.
ఫిబ్రవరి 27 వరకు విరాళాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అయోధ్యలోని 2.7 ఎకరాల స్థలంలో రామమందిర నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. హిందువులు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ దేవాలయల పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 1500 కోట్లతో ఆలయాన్ని నిర్మించాలని ప్రణాళికలు తయారు చేశారు.
భూకంపాలు, తుపాన్ బీభత్సాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునేలా ఆలయ నిర్మాణం సాగుతుంది. అందుకే ఈ నిర్మాణంలో ఇనుము వాడడం లేదు. వేల ఏళ్లయినా చెక్కు చెదరకుండా ఉండడానికి రాతితో నిర్మించే మందిరంలో ప్రతీ రాయికి మధ్య రాగి పలకల్ని ఏర్పాటు చేయనున్నారు.