జానారెడ్డి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు: మంత్రి ఎర్రబెల్లి

136
dayakarrao
- Advertisement -

కాంగ్రెస్ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి…నల్గొండ కు గడిచిన మూడేళ్ళ నుంచి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నాము…ఇవాళ కూడా మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని చెప్పారు.జానారెడ్డి ఇంటికి కూడా మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నాము- జానారెడ్డి నీళ్లు తాగుతున్నారని చెప్పారు.

సీనియర్ నాయకులుగా ఉండి అలా మాట్లాడటం మాకు బాధేస్తోందని తెలిపిన ఎర్రబెల్లి…రోడ్డు నిర్మాణం కారణంగా రెండు రోజుల నుంచి నీళ్లు జానారెడ్డికి నీళ్లు ఆఘాయని చెప్పారు. జానారెడ్డి రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడినట్లు అనిపిస్తోందని…ఇవాళ జానారెడ్డి ఇంటికి అధికారులను పంపుతున్నాము…..రాష్ట్ర వ్యాప్తంగా తాండలు లాంటి చిన్న చిన్న పల్లెలకు 90 వరకు ఇంకా మిషన్ భగీరథ రావడం లేదన్నారు.

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గంటలో కోటి మొక్కల కార్యక్రమం ఉందని…. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులందరూ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. కేసీఆర్ పుట్టినరోజు కానుకగా టార్గెట్ పెట్టుకోని ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని తెలిపిన ఎర్రబెల్లి…… ఆకుపచ్చ తెలంగాణ తేవడమే టార్గెట్ గా కార్యక్రమం చేయాలన్నారు.

2015 నుంచి ఇప్పటి వరకు అటవీ శాఖ లెక్కల ప్రకారం 4శాతం గ్రినరీ పెరిగిందని…. పార్టీలకు అతీతంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నా అన్నారు. తెలంగాణ ప్రజలు ఆంధ్రా పార్టీలు రానివ్వరు…. బీజేపీ నేతలు మాట్లాడే మాటల్లో అర్థం లేదన్నారు. దేశ వ్యాప్తంగా 2కోట్ల ఉద్యోగాలు అన్నారు..ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని…రైతు ఉద్యమానికి టీఆరెస్ పార్టీ మద్దతు ఉంటుందన్నారు.

- Advertisement -