Ram Mandir:18న గ‌ర్భ‌గుడిలోకి రాముడు..

12
- Advertisement -

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. నేటి నుండి రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించి మతాచారాలు ప్రారంభం కానున్నాయి. ఇక 18న శ్రీరాముడి విగ్రహాన్ని గర్బగుడిలోకి చేర్చనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది.

జ‌న‌వరి 22వ తేదీ మ‌ధ్యాహ్నం 12:20 గంట‌ల‌కు విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మం ఉంటుందని వెల్ల‌డించారు. ఈ ప్రాణ ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మం మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు పూర్త‌య్యే అవ‌కాశం ఉంద‌ని వివ‌రించారు. ప్ర‌ధాన ఆచార్యుడిగా కాశీకి చెందిన ల‌క్ష్మీకాంత్ దీక్షిత్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

రాముడి విగ్ర‌హం బ‌రువు 150 నుంచి 200 కిలోల వ‌ర‌కు ఉంటుంద‌ని చెప్పారు. 121 మంది ఆచార్యులు ఈ మ‌త‌ప‌ర‌మైన క్ర‌తువును నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్, యూపీ గ‌వ‌ర్న‌ర్ ఆనందీ బెన్ ప‌టేల్, యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌తో పాటు ఇత‌ర ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో రామ విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని వెల్లడించారు.

Also Read:Revanth Reddy:దావోస్​లో సీఎం రేవంత్​రెడ్డి

- Advertisement -