Ram Mandir:బాలరాముడి దివ్యరూపం

40
- Advertisement -

అయోధ్య రామమందిరంలోని గర్బగుడిలోకి ప్రవేశించారు బాలరాముడు. ఐదేళ్ల బాలుడిగా రామ్ లల్లా దర్శనమివ్వనుండగా విగ్రహానికి సంబంధింని నమూనాను రిలీజ్ చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.51 అంగులాల పొడవు ఉన్న విగ్రహం సుందరంగా కనిపించింది. రామ్ లల్లా విగ్రహాన్ని మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ అందంగా తీర్చిదిద్దారు.

రాముడి విగ్రహాన్ని పవిత్ర నదీ జలాలతో అభిషేకించారు. తర్వాత గణేశాంబికా పూజ, వరుణ పూజ, చతుర్వేదోక్త పుణ్యాహవచనం క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 22న శ్రీరాముడి అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి విగ్రహా ప్రతిష్ట ఉండనుంది. ప్రధాని మోడీ రామ్ లల్లాను దర్శించుకొని హారతి ఇవ్వనున్నారు.

Also Read:కాంగ్రెస్‌కు షాక్..సోనియాకు కరెంటు బిల్లులు పోస్ట్

- Advertisement -