బాహుబలి-2’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఒకపక్క బాహుబలి 2 ప్రభంజనానికి దాయాది దేశాలు సైతం సలామ్ చేస్తున్నాయి. భారీ కలెక్షన్స్‌తో ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన బాహుబలి2లో దర్శకధీరుడి పాత్ర అమోఘం అనిర్వచనీయం. సినిమా షూటింగ్ ప్రారంభమైన నాటి నుండి పట్టువిడవని విక్రమార్కుడిగా సినిమా కోసం దీక్ష పూని ఫైనల్‌గా బ్లాక్‌బస్టర్ హిట్ ఇన్ ఇండియన్ మూవీగా ‘బాహుబలి’ జెండా పాతేశారు.
ఇదిలాఉంటే తాజాగా రాజమౌళిపై వర్మ చేసిన కామెంట్ హాట్ టాపిక్‌గా మారాయి. బాహుబలి 1500 కోట్ల కలెక్షన్స్‌ను సాధించటాన్ని గురించి ప్రస్తావించిన వివాదాల వర్మ… బాహుబలి కలెక్షన్స్ కంటే.. రాజమౌళి వినమ్రత, విధేయత చూస్తే చాలా భయానకంగా ఉంటాయని ఆసక్తికర ట్వీట్ చేశారు. వర్మ ఇండస్ట్రీలో ఏ సినిమా విడుదలైనా.. హీరో దగ్గర నుండి నిర్మాతలు, దర్శకులు ఎవర్నీ వదలకుండా తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు.
అయితే బాహుబలి మూవీ విషయంలో మాత్రం పాజిటివ్‌గానే స్పందిస్తూ వస్తున్నారు. వర్మ తాజా ట్వీట్ల సారాంశాన్ని గమనిస్తే.. బాహుబలి చిత్రం షూటింగ్ ప్రారంభమైన నాటి నుండి రాజమౌళికి ఎదురైన పరిస్థితులను తనకు అనుకూలంగా మర్చుకోవడంలో సక్సెస్ అయ్యేరనే చెప్పాలి.
ముఖ్యంగా బాహుబలి 2 రిలీజ్ సమయంలో కర్ణాటకలో రిలీజ్‌కు ఎదురైన ఇబ్బందులను చాలా శాంతంగా పరిష్కరించుకున్నారు రాజమౌళి. కట్టప్పపై కన్నడ సంఘాలు విరుచుకుపడటం ఈ చిత్రాన్ని ప్రదర్శించనీయమంటూ ప్రతిన చేయటంతో.. వారిని సముదాయించటమే సక్సెస్ అయ్యారు రాజమౌళి.
అంతేకాకుండా సినిమా విడుదలైన తరువాత పైరసీని కంట్రోల్ చేయండంలో పోలీసులు అందించిన సహకారానికి గానూ డైరెక్ట్‌గా స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు థాంక్స్ చెప్పడంతో పాటు.. బాహుబలి 2 మూవీ ఇంత ఘనవిజయాన్ని సాధించడంతో అభిమానులకు ధన్యవాదాలు తెలపడం కోసం విజయోత్సవ ఈవెంట్‌ను నిర్వహించాడానికి రాజమౌళి ప్రణాళికలు సిద్దం చేస్తుండటంతో వర్మ ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చని తెలుస్తోంది.