30న ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం..

187

నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ప్రధానిగా నరేంద్రమోదీ ఈ నెల 30న సాయంత్రం ఏడు గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ నిర్ధారించింది. నరేంద్ర మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల పేర్లను మాత్రం వెల్లడించలేదు. అమాత్య పదవులకు తీవ్ర పోటీ ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Prime Minister Narendra Modi

పశ్చిమబెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు మోదీ కేబినెట్‌లో పదవీ యోగం లభించనున్నట్లు సమాచారం. ముఖ్య విభాగాలైన ఆర్థిక, హోం, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖల్లో ఒకటి అమిత్‌ షాకు ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అరుణ్‌ జైట్లీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ సారి ఆయనకు ఆర్థిక మంత్రి పదవి లేనట్లే కనిపిస్తోంది. ఈ శాఖ బాధ్యతలను పీయూష్‌ గోయల్‌కు అప్పగించే అవకాశముంది.

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి సొంతంగా అధికారంలోకి రావడానికి కావాల్సిన మ్యాజిక్ నెంబర్ 272ను మించి ఎంపీ సీట్లు గెలుచుకుంది. బీజేపీ సొంతంగా 303 స్థానాలు గెలుచుకుంది.