రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సర్కార్ 3. గతంలో రెండు భాగాలుగా రిలీజ్ అయిన సర్కార్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వంగవీటి తరువాత వర్మ దర్శకత్వంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వర్మ మార్క్ అంచనాలకు తగ్గట్టుగా డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల అభిమానులను ఆకట్టుకుంది.
ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జనవరి 23న శివసేన లీడర్ బాల్ థాకరే జయంతి సందర్భంగా సర్కార్ చిత్ర టీజర్ విడుదల కానుందంటూ ప్రచారం జరిగింది. కానీ అవన్నీ పుకార్లేనని తేలింది.
తాజాగా ట్విట్టర్‌లో సర్కార్ 3 రిలీజ్ డేట్ ప్రకటించాడు వర్మ. ఏప్రిల్ 7న ఈ చిత్రం విడుదల కానుందంటూ అఫీషియల్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఆ రోజే వర్మ పుట్టిన రోజు కూడా కావడం విశేషం. సర్కార్ 3 చిత్రంలో మనోజ్ బాజ్ పేయ్, యామి గౌతమ్, జాకీ ష్రాఫ్ , రోనిత్ రాయ్ మరియు అమిత్ సద్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఒకప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ కొన్నాళ్ళుగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. తెలుగులో వంగవీటి తన చివరి చిత్రం అని ప్రకటించిన వర్మ బాలీవుడ్ సినిమాల ద్వారా తన సత్తా చూపించాలని డిసైడ్ అయ్యాడు. కొంతకాలంగా వరుస ఫ్లాప్లతో ఇమేజ్ కోల్పోయిన రామ్ గోపాల్ వర్మ సర్కార్ సీక్వల్తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు.
ఈ చిత్రంతో వర్మ తన పునర్వైభవాన్ని చాటుకుంటాడని సినీ వర్గాల్లో ఓ చర్చ అయితే నడుస్తున్నది. ఇక వర్మ ఆ మధ్య ప్రకటించిన న్యూక్లియర్ ప్రాజెక్ట్ దాదాపు 340 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందనుందని ఈ సినిమా కోసం, రెండు , మూడు సంవత్సరాల సమయాన్ని కేటాయించవలసి ఉంటుందని అన్న వర్మ శశికళ అనే చిత్రాన్ని 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు రిలీజ్ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Sarkar 3 to release on April 7th..On My Birthday😌 pic.twitter.com/mjOGmiBino
— Ram Gopal Varma (@RGVzoomin) February 8, 2017