కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎప్రిల్ 14వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ పై తనదైన శైలిలో స్పందించారు వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లాక్ డౌన్ అమల్లో ఉన్నా తాను నగరంలో చాలా ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు తెలిపారు. కిచర్ పూర్, సోఫా చౌక్, బెడ్ రూమ్ నగర్, డైనింగ్ పేట, బాల్కనీ కార్నర్, ఫ్రిడ్జ్ స్ట్రీట్, బాత్ రూమ్ సర్కిల్, వాషింగ్ మెషీన్ నగర్, టెలివిజన్ స్టేషన్ అన్నీ తిరిగేస్తున్నాను” అంటూ ఆయన చమత్కారంగా ట్వీట్ చేశారు. వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా కరోనా వైరస్ పై సంగీత దర్శకుడు కోఠి స్వరపరిచిన సాంగ్ పై కూడా కామెంట్ చేశాడు. ఈ సాంగ్ లో చిరు, నాగ్, ,సాయి తేజ్, వరుణ్ తేజ్ లు నటించారు. ఈ మల్టీస్టారర్ సాంగ్ అద్భుతంగా ఉందన్నారు. కరోనా వైరస్ కూడా ఈ పాటను ఇష్టపడుతుందన్నారు. ఇక ఎప్రిల్ 1న తానుకూడా కరోనా వైరస్ పై పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈసాంగ్ విని ఎవరు ఫూల్ అవుతారో తనకు తెలియదన్నారు.
Main areas in the city I am residing presently are Kitchenpur,Sofa chowk,Bedroom nagar,Dining pet ,Balcony corner,Fridge street,Bathroom Circle,Washingmachinenagar and Television station
— Ram Gopal Varma (@RGVzoomin) March 29, 2020
MEGA emotional MULTISTAR Song on CORONAVIRUS is so mindblowinglyfantastic that intelligence sources from BACTERIA WORLD told even CORONAVIRUS LOVED IT https://t.co/Ba4gWlegmB Am myself releasing my own non emotional CORONA song on APRIL FOOL DAY .LET VIRUS DECIDE WHO IS FOOL
— Ram Gopal Varma (@RGVzoomin) March 29, 2020