గేమ్ చేంజర్..పక్కా బ్లాక్ బాస్టర్!

4
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న విడుదల కాబోతోంది. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు.

గ్లోబ‌ల్ స్టార్‌ రామ్ చరణ్ మాట్లాడుతూ.. శంకర్ చేసిన స్నేహితుడు సినిమాకు గెస్టుగా వెళ్లాను. ఆ టైంలో ఆయనతో మాట్లాడేందుకు కూడా చాలా టెన్షన్ పడ్డాను. నాతో కాకపోయినా ఎవరితో అయినా సరే ఓ తెలుగు సినిమా చేయండని అడుగుదామని కూడా అడగలేకపోయాను. కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా.. క్రికెట్‌కు సచిన్ ఎలాగో.. ఇండియన్ సినిమాకు శంకర్ గారు అలా.. డైరెక్టర్లకే డైరెక్టర్ ఆయన. అలాంటి శంకర్ గారితో పని చేయడం నా అదృష్టం. నా నుంచి సోలో ఫిల్మ్ వచ్చి ఐదేళ్లు అవుతోంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ మూవీ ఏ ఒక్కర్నీ నిరాశపర్చదు. ఏం సాధించాలన్నా సహనం ఉండాలి. పుష్ప 2తో సుకుమార్ గారు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అలాంటి సుకుమార్ గారు మా ఈవెంట్‌కు వచ్చి మాట్లాడటం ఆనందంగా ఉంది. దిల్ రాజు గారితో పని చేయడం ఆనందంగా ఉంది అన్నారు.

స్టార్ ప్రొడ్యూస‌ర్‌ దిల్ రాజు మాట్లాడుతూ.. ‘డల్లాస్‌లో ఈవెంట్ గురించి రాజేష్‌తో మాట్లాడాం. అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. ఈవెంట్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. 1998లో ఒకే ఒక్కడు సినిమాతో మా జర్నీ ప్రారంభం అయింది. శంకర్ గారు, చంద్రబాబు గారి చేతుల మీదుగా వంద రోజుల షీల్డ్ తీసుకున్నాం. శంకర్ గారు నిర్మించిన వైశాలి మూవీని తెలుగులో రిలీజ్ చేశాను. అలా శంకర్ గారితో జర్నీ చేస్తున్న మేం ఇలా గేమ్ చేంజర్‌ను నిర్మించాం. మా కో డైరెక్టర్ గారి ద్వారా శంకర్ గారు మాతో సినిమా చేయాలని, తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్నారని తెలిసింది. అప్పుడే ఆర్ఆర్ఆర్ షూట్‌లో రామ్ చరణ్ ఉన్నారు. అప్పుడు ఈ కథ ఆయనకు చెప్పడం, నచ్చడం అలా జర్నీ మొదలైంది. మా బ్యానర్లో ఇది 50వ సినిమా. ఇంత పెద్ద బడ్జెట్‌తో నేను ఎప్పుడూ సినిమాలు తీయలేదు. కరోనా వల్ల కాస్త ఆలస్యం అయింది. డోప్ సాంగ్‌ను ముందుగా నేను ఫోన్‌లో చూశా. ఈ పాటను డల్లాస్‌లో రిలీజ్ చేస్తున్నామని తెలిసి నాకు సంతోషం వేసింది. ఈ పాటను చూసినప్పుడు నాకు కంట్లోంచి ఆనందబాష్పాలు వచ్చాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వల్లే ఈ సినిమా ఈ స్థాయికి వచ్చింది. నేను చిరంజీవి గారి చిత్రాలను ఆడియెన్‌గా చూసి ఎంజాయ్ చేశా. కానీ తొలిప్రేమ సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా ఎంజాయ్ చేశాను. కళ్యాణ్ గారితో సినిమా తీయడానికి నాకు చాలా టైం పట్టింది. మెగా ఫ్యామిలీతో ఉన్న బాండింగ్‌తో ఎవడు చేశాం. అది రిలీజై 11 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు గేమ్ చేంజర్‌తో మళ్లీ సంక్రాంతికి రాబోతోంది. ఈ సారి మామూలుగా కొట్టడం లేదు. గట్టిగా కొట్టబోతోన్నాం. శంకర్ గారి పాటలు, ఫైట్లు సెల్ ఫోన్‌లలో చూస్తే ఫీలింగ్ రాదు. వాటిని బిగ్ స్క్రీన్‌పైనే చూడాలి. ప్రతీ సాంగ్‌ను శంకర్ గారు అద్భుతంగా డిజైన్ చేసుకుంటారు. రా మచ్చా పాటను వైజాగ్, అమృత్ సర్‌లో 300 మందితో షూట్ చేశారు. నానా హైరానా పాటకోసం ప్రయోగాలు చేశారు. ఆ పాటను న్యూజిలాండ్‌లో షూట్ చేశారు. జరగండి పాట లీక్ అయింది. అందుకే హడావిడిగా రిలీజ్ చేశాం. కానీ శంకర్ గారు సంతృప్తి చెందలేదు. ఆ పాట ఏంటో మీకు థియేటర్లో తెలుస్తుంది. సాంగ్ వేనుమా సాంగ్ ఇరుక్కు.. ఫైట్ వేనుమా ఫైట్ ఇరుక్కు.. సంక్రాంతికి సూపర్ హిట్ ఇరుక్కు.. రామ్ చరణ్, సూర్య గారికి మధ్య జరిగే సీన్లు నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. రెండు రాష్ట్రాల్లో జరిగే రాజకీయ అంశాలు చాలా కనిపిస్తాయి. కానీ ఇవన్నీ నాలుగేళ్ల క్రితం శంకర్ గారు రాసుకున్నారు. అవి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. తమన్ మంచి సంగీతాన్ని ఇచ్చాడు. శంకర్ గారి శిష్యుడని అనిపించుకుంటాడు. నా వెన్నంటి ఉండి నడిపిస్తున్న టీంకు థాంక్స్. శంకర్ గారే మా అందరినీ ముందుకు నడిపిస్తూ వచ్చారు. ఓ తెలుగు సినిమాకు ఇలా మొదటి సారిగా ఇక్కడ ఈవెంట్ నిర్వహించి గేమ్ చేంజర్‌తో.. గేమ్ చేంజ్ చేశాం. సుకుమార్‌ని నేను పరిచయం చేయలేదు. మా ఇద్దరి జర్నీ ఒకేసారి ప్రారంభం అయింది. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్‌ పెద్ద హిట్ కాబోతోంది. గేమ్ చేంజర్‌తో పాటుగా సంక్రాంతికి వస్తున్నాం తీసుకురమ్మని చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు సపోర్ట్ ఇచ్చారు. బాలయ్య బాబు డాకు మహారాజ్ చిత్రం కూడా రాబోతోంది. పండుగకు రాబోతోన్న అన్ని చిత్రాలు సూపర్ హిట్ అవ్వాలి అన్నారు.

Also Read:పీవీ…తెలంగాణ ఠీవి!

- Advertisement -